కలెక్టర్, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే, జిల్లాకి సంబంధించిన నాయకులు సమక్షంలో… అందరి తరపునా వారి కుటుంబానికి భరోసా ఇస్తున్నామన్నారు. దాడికి పాల్పడి తప్పించుకున్న 9 మందిని వెంటనే పట్టుకోమని, తగిన విధంగా చర్యలు తీసుకోమని ఎస్పీకి ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ దాడి చేసినవారు ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తప్పవన్నారు. ఏ నాయకుడైనా అధికారులపై దాడి చేసినా, అన్యాయంగా వారి విధులను అడ్డుకున్నా కఠినమైన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఎవ్వరైనా సరే ఆధిపత్య ధోరణితో దాడి చేస్తే ఉపేక్షించే ప్రభుత్వం కాదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here