అనన్య నాగళ్ళ అచ్చ తెలుగింటి అమ్మాయి.. అలాంటి అనన్య తెలుగు సెలెక్టెడ్ గా మూవీస్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది అలాంటి అమ్మాయి ఇక బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ విషయాన్నీ రీసెంట్ గా ఒక షో ఇంటర్వ్యూలో చెప్పింది. “నేను బాలీవుడ్ లో ఒక మూవీ చేయబోతున్నా. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళబోతున్నా. అదొక పీరియాడిక్ డ్రామా అలాగే ఫిమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టు. ఒక ట్రైబల్ గర్ల్ గా చేయబోతున్నా. ఆ ట్రైబల్ విలేజ్ లో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనల నుంచి తన ట్రైబల్ పీపుల్ ని ఎలా కాపాడుకుంది ఆ అమ్మాయి అన్నదే స్టోరీ. ఆ ఇన్సిడెంట్స్ నుంచి ఆ అమ్మాయి ఎలా బయటపడింది అన్నదే కథ. చాలా మంచి స్టోరీ అది. ఇండియా మొత్తం కనెక్ట్ అయ్యే లైన్ అది.

మంచి స్క్రిప్ట్, మంచి ఫైట్స్, డాన్స్ లు కూడా ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ రిలీజ్ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా. మేబి వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందేమో. ఈ ప్రాజెక్ట్ కోసం కొంచెం కొంచెంగా ఫైటింగ్స్ కూడా నేర్చుకున్నా.” అని చెప్పింది అనన్య నాగళ్ళ. ఇక  ఆరియానా ఐతే “అనన్య ముంబై ఇంటర్వ్యూస్ ఉంటే చెప్పు నేను కూడా వచ్చి చేస్తాను అని చెప్పింది. తప్పకుండా  మనిద్దరం కలిసి హిందీలో ఒక ఇంటర్వ్యూ కూడా చేద్దాం” అని చెప్పింది అనన్య. ఇక అనన్య నాగళ్ళ  “మ‌ల్లేశం’ మూవీతో  తెలుగు ఆడియన్స్ కి  ప‌రిచ‌యం అయిన తెలుగమ్మాయి. ‘మ‌ల్లేశం’లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక అక్క‌డ నుంచి వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీ అయిపోయింది. పవన్ కళ్యాణ్ మూవీ ‘వ‌కీల్ సాబ్’లో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. ఇక ఈ మ‌ధ్యే ‘తంత్ర’ పేరుతో అంద‌రినీ భ‌య‌పెట్టింది. ఇక ‘పొట్టేల్’ లో నటించింది .

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here