సంక్రాంతి హీరోగా అభిమానుల చేత,ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకునే హీరోల్లో,నందమూరి నటసింహం యువరత్న బాలకృష్ణ(balakrishna)ముందు వరుసలో ఉంటాడని చెప్పవచ్చు.ఆయన నటించిన చాలా చిత్రాలు సంక్రాంతికి రిలీజయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నాయి.ఆ కోవలోనే ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కాబోతున్న’డాకు మహారాజ్’ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అభిమానులతో పాటుప్రేక్షకులు కూడా నమ్ముతున్నారు.ప్రచార చిత్రాలు కూడా అందుకు బలాన్నిస్తున్నాయి.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ మేకర్స్ ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచబోతున్నారు.జనవరి 2 న హైదరాబాద్ లో ట్రైలర్ రిలీజ్,4 న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ ఒక సాంగ్ ని రిలీజ్ చెయ్యబోతున్నారు.ఆ తర్వాత 8 న ఏపిలోని విజయవాడ లేదా మంగళగిరి లో మరోసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా జరపనున్నారు.
ఈ విషయాలన్నింటిని డాకు మహారాజ్(daku maharaj)ని నిర్మిస్తున్న ప్రొడ్యూసర్ నాగవంశీ(naga vamsi)నే స్వయంగా వెల్లడి చేసాడు.రీసెంట్ గా మూవీకి సంబంధించిన మరో విషయాన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది.తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతు ఇంటర్వెల్ బ్యాంగ్ కి ఇరవై నిమిషాల ముందు ఒక క్రేజీ ఎపిసోడ్ ఉంటుంది.ఇది అభిమానులకి,మాస్ ఆడియెన్స్ కి ఒక రేంజ్ లో ట్రీట్ ఇస్తుంది. ఇదంతా ఒక మ్యాడ్ లెవెల్ సీక్వెన్స్ లా ఎవరూ ఊహించని రేంజ్ లో ఉంటుంది.డెఫినెట్ గా ఆడియెన్స్ థ్రిల్ అవుతారని చెప్పాడు.ఇప్పుడు నాగ వంశీ చేసిన ఈ వ్యాఖ్యలతో ‘డాకు మహారాజ్’ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని అభిమానులతో ప్రేక్షకులు రిగర్ గా వెయిట్ చేస్తున్నారు.
బాలకృష్ణ సరసన ప్రగ్య జైస్వాల్(pragya jaiswal)హీరోయిన్ గా చేస్తుండగా ఊర్వశి రౌతేలా మరో ముఖ్య పాత్రలో కనిపిస్తుంది. హిందీ అగ్ర హీరో,ఇటీవల యానిమల్ మూవీలో విలన్ గా చేసి మెప్పించిన ‘బాబీ డియోల్'(bobby deol)విలన్ గా చేస్తున్నాడు.బాబీ(bobby)దర్శకుడు కాగా సితార ఎంటర్ టైన్మెంట్ బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది. తమన్(taman)సంగీత దర్శకుడు.