నాచురల్ స్టార్ నాని(nani)హీరోగా ఆర్ఆర్ఆర్(rrr)ప్రొడ్యూసర్ దానయ్య(danayya)నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన మూవీ ‘సరిపోదా శనివారం'(Saripodhaa Sanivaaram)అగస్ట్ 29 న రిలీజైన ఈ మూవీకి వివేక్ ఆత్రేయ(vivek athreya)దర్శకుడు కాగా ప్రియాంక మోహన్(priyanka mohan)హీరోయిన్ గా చేసింది.వర్షాలని సైతం లెక్కచేయకుండా నాని అభిమానులు,ప్రేక్షకులు ఈ చిత్రానికి ఘన విజయాన్ని సాధించి పెట్టారు.నాని కెరీరి లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 100 కోట్ల మార్కెట్ ని కూడ అందుకుంది.
ఇప్పుడు ఈ మూవీ హిందీలోకి రీమేక్ కాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్(kartik aaryan)హీరోగా చెయ్యబోతున్నాడని,దీని మీద త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు.ఇదే నిజమైతే కనుక కార్తీక్ ఆర్యన్ కెరీర్ లో ఇంకో హిట్ చేరినట్టే అనుకోవచ్చు ఎందుకంటే సరిపోదా శనివారం నూటికి నూరుపాళ్లు పర్ఫెక్ట్ యాక్షన్ సబ్జెక్టు.హిందీ ప్రేక్షకులు ఆ తరహా సబ్జెట్స్ ని ఎంతగానో ఇష్టపడతారు.మోస్ట్లీహిందీలో తెరకెక్కిన అన్ని సినిమాల్లో కూడా యాక్షన్ ఒక రేంజ్ లో ఉంటూ లవ్,కామెడీ,సెంటిమెంట్ దానికి అటాచ్మెంట్ గా ఉంటాయి.కాబట్టి హిందీ ప్రేక్షకులకి ‘సరిపోదా శనివారం’ నచ్చడం పక్కా అని భావించవచ్చు.
మరి పోలీస్ ఆఫీసర్ గా విజృంభించి నటించిన ఎస్ జె సూర్య(sj surya)క్యారక్టర్ లో ఆయనే చేస్తాడా లేక వేరే వాళ్ళు చేస్తారో తెలియాలి.అలాగే దానయ్య నే హిందీ లో కూడా నిర్మిస్తాడా,లేక వేరే వాళ్లా అనేది కూడా తెలియాల్సి ఉంది.కొన్ని రోజుల ఆగితే గాని మూవీకి సంబంధించిన అన్ని విషయాల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.కార్తీక్ ఆర్యన్ లేటెస్ట్ గా ‘చందు ఛాంపియన్’ ,’భూల్ భూలయ్య 3 ‘ తో వరుస హిట్ లని అందుకొని ఎంటైర్ తన సినీ కెరీర్లోనే మంచి సక్సెస్ జోష్ లో ఉన్నాడు.