హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయని ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ఏపీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్ నుంచి లేదా టికెట్ బుకింగ్ ఏజెంట్ల నుంచి ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. ఎంజీబీఎస్‌లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా… కొన్ని మార్పులు చేసినట్లు ప్రకటించింది. జనవరి 10 – 12 మధ్య కర్నూలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే రెగ్యూలర్, ప్రత్యేక బస్సులను గౌలిగూడ సీబీఎస్ నుంచి ఆపరేట్ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని కోరింది.