ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో వరసుగా కీలక పరిణామాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఏసీబీ కేసు ఆధారంగా… విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంలో అధికార దుర్వినియోగం జరిగిందనే కోణంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. మాజీమంత్రి కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఇందులో భాగంగానే.. విచారణ కోసం నోటీసులను జారీ చేసింది.