మూవీ : మురా

నటీనటులు:  హృదు హరన్, జోబిన్ దాస్, యదుకృష్ణ, సూరజ్ వెంజరమూడు, మాలా పార్వతి తదితరులు

ఎడిటింగ్: చమన్ చాకో

సినిమాటోగ్రఫీ: ఫాజిల్ నజర్

మ్యాజిక్: క్రిస్టీ జోబీ

నిర్మాతలు: రియా శిబు

దర్శకత్వం:  మహమ్మద్ ముస్తాఫా

ఓటీటీ: అమెజాన్ ప్రైమ్

కథ: 

కేరళలోని ఓ ప్రాంతంలో నలుగురు కుర్రాళ్ళుంటారు. వాళ్ళు మంచి స్నేహితులు. వాళ్ళే ఆనంద్ (హృదు హరున్) షాజీ (జోబిన్ దాస్) మను (యదుకృష్ణ) మనఫ్ (అనుజీత్). ఈ నలుగురిలో ఆనంద్ మాత్రమే మిడిల్ క్లాస్ కుర్రాడు. మిగతా వాళ్లంతా దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. ఖర్చుల కోసం లోకల్ రౌడీలతో ఈ నలుగురు కలుస్తారు. లోకల్ రౌడీ లీడర్ వాళ్లను ‘అనీ’ (సూరజ్ వెంజరమూడు)కు పరిచయం చేస్తాడు. గ్యాంగ్ స్టర్ రమాదేవి (మాలా పార్వతి) దగ్గర ప్రధానమైన అనుచరుడిగా అతను పనిచేస్తుంటాడు. ఈ నలుగురు కుర్రాళ్లకు భయమనేది తెలియదనీ, అప్పగించిన పనిని ధైర్యంగా పూర్తి చేస్తారనే విషయాన్ని అనీ గమనిస్తాడు. తమ గ్రూప్ లో అలాంటి కుర్రాళ్లు ఉండాలని భావించి, వాళ్లకు అడ్వాన్స్ ఇస్తాడు. ఇక అప్పటి నుంచి నలుగురు కుర్రాళ్లు చెలరేగిపోతారు. అదే సమయంలో ఒక సీక్రెట్ ప్లేస్ లో పెద్దమొత్తంలో బ్లాక్ మనీ ఉంటుంది. మధురై ప్రాంతంలో దాచబడిన ఆ బ్లాక్ మనీని తీసుకొచ్చే బాధ్యతను ఆ నలుగురు కుర్రాళ్లకు అప్పగించాలని అనీ అనుకుంటాడు. వాళ్లపై తనకి పూర్తి నమ్మకం ఉందని రమాదేవిని ఒప్పిస్తాడు. ఈ నలుగురు కుర్రాళ్లు, మధురైకి చెందిన లోకల్ కుర్రాళ్లను ఇద్దరినీ వెంటబెట్టుకుని, బ్లాక్ మనీ దాచిన ప్రదేశానికి చేరుకుంటారు. ఆ నలుగురు దొంగతనం చేశారా? అసలు అక్కడ ఏం జరిగిందనేది మిగతా కథ.

విశ్లేషణ:

మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ జీవనశైలి గురించి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఎందులోనైనా స్టోరీ వారికి సపోర్ట్ ఇస్తూ క్లైమాక్స్ లో సక్సెస్ అయితే చాలు అది హిట్ సినిమా.‌ మరి ఈ సినిమా అలా సక్సెస్ అయ్యిందా అంటే అయ్యిందనే చెప్పాలి. నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కలలకి సపోర్ట్ ఇచ్చే సరైన వ్యక్తి రావడంతో కథ ఎంగేజింగ్ గా సాగుతుంది. దర్శకుడు ఈ నలుగురు స్నేహితుల పాత్రలను చక్కగా డిజైన్ చేశాడు. ఈ నలుగురు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండటం .. స్నేహానికి కట్టుబడి ఉండటం బాగుంటుంది.

నలుగురి పాత్రల్లో ఆడియన్స్ తమని తాము చూసుకుంటారు. ఒకానొక సమయంలో వాళ్లతో కలిసి ఎమోషనల్ గా ట్రావెల్ అయ్యేలా చేస్తుంది. ఇంట్లోవాళ్లు చదువుకోమన్నా .. ఏదైనా పని చూసుకుకోమన్నా పెద్దగా పట్టించుకోరు. కుటుంబ బరువు బాధ్యతలు ఎంతమాత్రం పట్టనివారే. సరదాగా కబుర్లు  చెప్పుకుంటూ కులాసాగా బైక్ లపై తిరిగేస్తూ ఉంటారు. కుర్రాళ్లు గ్యాంగ్ స్టర్ కోసం పనిచేయడం ఫస్టు పార్టుగా .. గ్యాంగ్ స్టర్ తోనే తలపడటం ద్వితీయార్థంలో మలుపు తిరుగుతుంది. అందుకు సంబంధించిన సన్నివేశాలు నేచురల్ గా ఉంటాయి.

మొదటి అరగంట క్యారెక్టర్ల పరిచయానికి కాస్త టైమ్ తీసుకుంటాడు. కానీ అది తర్వాత వచ్చే సీన్లకి బలాన్ని ఇస్తూ ఆ నలుగురికి క్యారెక్టర్ల ఇంపాక్ట్  కనపడుతుంది. సెకంఢాఫ్ లో చివరి ఇరవై నిమిషాలు ఉత్కంఠభరితంగా సాగుతాయి. యాక్షన్, ఎమోషన్ సీన్లు కనెక్ట్ అవుతాయి. ఎక్కడా సినిమాటిక్ గా ఏదీ అనిపించదు. మొదటి నుంచి చివరి వరకూ ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. గ్యాంగ్, హత్యలు అంటు కాస్త రక్తపాతం ఉంటుంది. అది వదిలేస్తే మిగతాదంతా ఓకే. క్రిస్టీ జోబీ సంగీతం బాగుంది. ఫాజిల్ నజర్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. చమన్ చాకో ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

ఆనంద్ పాత్రలో హృదు హరన్, షాజీగా జోబిన్ దాస్, మనుగా యదుకృష్ణ, మనఫ్ గా అనుజీత్ ఒదిగిపోయారు. అనీగా సూరజ్ వెంజరమూడు సినిమాకి ప్రధాన బలంగా నిలిచాడు. రమాదేవీగా మాలా పార్వతీ ఆకట్టుకున్నారు. మిగతావారంతా తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.


ఫైనల్ గా : సంతృప్తినిచ్చే రివేంజ్ డ్రామా. సెకెంఢాఫ్ కోసం ఓసారి చూసేయొచ్చు.

రేటింగ్: 2.5/ 5

✍️. దాసరి  మల్లేశ్


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here