కామారెడ్డి జిల్లాలో ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్‌, కంప్యూటర్ ఆపరేటర్ మూకుమ్మడి ఆత్మహత్యల ఘటనపై పోలీస్‌ శాఖ సీరియస్‌ అయ్యింది. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చే వరకు… ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని, వారి మధ్య ఉన్న సంబంధాలపై పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నా… ఎందుకు నిఘా పెట్టలేకపోయారని నిలదీసినట్లు తెలిసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎస్పీ సింధూశర్మను రాష్ట్ర పోలీసుశాఖ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణకు ఎస్పీ మూడు టీమ్ లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ కేసు విచారణకు కాల్‌డేటా, వాట్సాప్‌ చాటింగ్‌, సీసీ పుటేజీ, పోస్టుమార్టం రిపోర్టులు కీలకం కానున్నాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here