సూపర్ స్టార్ మహేష్ బాబు(mahesh babu)వన్ మాన్ షో ‘గుంటూరు కారం'(guntur kaaram)ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై ప్రేక్షకాదరణని అందుకున్న విషయం తెలిసిందే.త్రివిక్రమ్(trivikram)దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో మహేష్ సరసన శ్రీలీల(sreeleela)మీనాక్షి చౌదరి(meenakshi chowdhary)జత కట్టగా హాసిని అండ్ హారిక క్రియేషన్స్ పతాకంపై సూర్య దేవర చినబాబు(chinababu)నిర్మాతగా వ్యవహరించాడు.థమన్(taman)సంగీతాన్ని అందించడం జరిగింది.

రీసెంట్ గా యూట్యూబ్ తమ జాబితాలో వరల్డ్ వైడ్ గా వివిధ దేశాలకి చెందిన సినిమాల్లో టాప్ పొజిషన్ లో నిలిచిన పాటల జాబితాని ప్రకటించింది.అందులో ఇండియాలోని అన్ని భాషలకి సంబంధించి తెరకెక్కిన సినిమాల్లో టాప్ గా నిలిచిన పాటగా గుంటూరు కారంలోని సాంగ్  నిలిచింది. అందులోని కుర్చీ మడతపెట్టి  వీడియో సాంగ్ 526 మిలియన్ల వ్యూస్ ని అంటే 52 కోట్ల వ్యూస్ ని సంపాదించింది. ఇంతవరకు ఏ ఇండియన్ సినిమాలోని పాట ఈ రికార్డుని అందుకోలేదు.ఇక ఈ రికార్డు సాధించడం పై చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని కూడా తెలియచేసింది.

 

కుర్చీ మడత పెట్టి సాంగ్ లో మహేష్, శ్రీలీల ఒక రేంజ్ లో డాన్స్ చెయ్యగా ప్రముఖ నటి పూర్ణ కూడా ఆ సాంగ్ లో మెరిసి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీని అందించడం జరిగింది.

 


 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here