తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 29 Dec 202402:06 AM IST
తెలంగాణ News Live: BRS Party : ఈడీ కేసులో కేటీఆర్…! అదే జరిగితే బీఆర్‌ఎస్ పగ్గాలు ఎవరికి…?
-
ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. జనవరి 7న విచారణకు రావాలని దర్యాప్తు సంస్థ కోరింది. మరోవైపు ఈ కేసులో ఏసీబీ కూడా దూకుడుగా ముందుకెళ్తోంది. ఒకవేళ ఈ కేసులో అరెస్ట్ వంటి పరిణాామాలు చోటు చేసుకుంటే…బీఆర్ఎస్ ను కవిత లీడ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
Sun, 29 Dec 202401:09 AM IST
తెలంగాణ News Live: karimnagar : తప్పుడు పత్రాలతో భూమిని కాజేసిన ఘనుడు – తీగ లాగితే డొంకంతా కదిలింది..!
- తప్పుడు పత్రాలు సృష్టించి ఎకరం భూమిని కాజేసిన వారిపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 8 మంది పేరిట రిజిస్ట్రేషన్ చేసిన ఘరానా మోసగాడిని అరెస్ట్… చేసి జైలుకు పంపించారు. మరో ముగ్గురి కోసం కొత్తపల్లి పోలీసులు గాలిస్తున్నారు.
Sun, 29 Dec 202412:25 AM IST
తెలంగాణ News Live: TG Govt Schemes : రైతుబంధు.. వడ్లకు బోనస్.. తెలంగాణ రైతులు ఏది కోరుకుంటున్నారు? 8 ముఖ్యాంశాలు
- TG Govt Schemes : తెలంగాణలో వరిసాగు ఊహించని స్థాయిలో పెరిగింది. ధాన్యం కొనుగోలు విషయంలో అన్నదాతలు మొదట్లో భయపడినా.. ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు రైతుబంధు, వడ్లకు బోనస్‌పై తెలంగాణ రైతుల్లో చర్చ జరుగుతోంది. తమకు ఏది మంచిదో అన్నదాతలు చర్చించుకుంటున్నారు.