మైక్రోలినో డిజైన్- డైమెన్షన్స్..
ఫుల్లీ రెట్రో థీమ్ డిజైన్ ఈ మైక్రోలినో ఎలక్ట్రిక్ కారు సొంతం. ముందు వైపు డోర్ ఓపెన్ అవ్వడం ఈ డిజైన్ హైలైట్. ఇందులో ఫ్రెంట్- రేర్ హారిజాంటల్ లైట్ బార్స్, బై- ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్‌లైట్ వంటి ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇందులో స్టైలిష్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. సాఫ్ట్ క్లోజ్ ఫ్రెంట్ డోర్ మెకానిజం, 4 వీల్స్‌కి ఇండిపెండెంట్ సస్పెన్షన్ సిస్టెమ్, వీగన్ లెథర్ ట్రిమ్డ్ స్టీరింగ్ వీల్, ఇంటిగ్రేటెడ్ పోర్టెబుల్ బ్లూటూత్ స్పీకర్, 3 లేవల్ ఎలక్ట్రిక్ హీటింగ్ సెటప్, సెంట్రల్ లాకింగ్ సిస్టెమ్, హీటెడ్ ఫ్రెంట్ అండ్ రేర్ విండ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్- టచ్‌స్క్రీన్ సెంట్రల్ డిస్ప్లే వంటివి ఈ ఈవీలోని మరికొన్ని ఫీచర్స్.