కాకినాడలోని యూనివర్సల్ బయోఫ్యూయల్స్ వ్యవహారంపై తనిఖీలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వాకలపూడి ఇండస్ట్రీయల్‌ ఏరియాలో ఉన్న యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి కాలుష్యకారక దుర్గంధం వెలువడడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా సంస్థ నుంచి ఘాటైన, దుర్గంధ వాయువులు విడుదల విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. శనివారం ఉదయం పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ కృష్ణయ్య, పీసీబీ కాకినాడ రీజనల్ ఆఫీసర్ శంకరరావుతో ఫోన్లో మాట్లాడారు. యూనివర్సల్ బయోఫ్యూయల్స్ సంస్థ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తుందో? లేదో? పరిశీలించి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు వాయు కాలుష్య సమస్యలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here