గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)నటించిన గేమ్ చేంజర్(game changer)మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విజయవాడకి చెందిన రామ్ చరణ్ యువశక్తీ అభిమానులు ఇండియాలోనే ఇంత వరకు ఏ హీరోకి లేని విధంగా 256 అడుగుల భారీ కట్ అవుట్ ని విజయవాడలో ఏర్పాటు చేసి ఈ రోజు హెలికాఫ్టర్ చేత కట్ అవుట్ పై పూల వర్షాన్ని కురిపించడం జరిగింది.ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా విచ్చేశాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుహతు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్(pawan kalyan)వస్తున్నారు.ఆయనకి ఉన్న డేట్స్ ని బట్టి జనవరి 4 లేదా 5 న భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ న్యూస్ తో మెగా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ వచ్చినట్లయింది. కాకపోతే ఎక్కడ నిర్వహిస్తామనే విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. మూవీ కూడా అభిమానులకి, ప్రేక్షకులకి నచ్చుతుందని, సరికొత్త రికార్డులు సృష్టించడం పక్కా అని కూడా అయన చెప్పుకొచ్చాడు.
చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపిస్తున్న ఈ మూవీలో చరణ్ సరసన కియారా అద్వానీ జోడి కట్టగా అంజలి, శ్రీకాంత్,ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. తమన్ సంగీత సారధ్యంలో ఇప్పటికే రిలీజైన నాలుగు పాటలు,ఒక రేంజ్ లో ఉన్నాయి. త్వరలోనే ఐదో పాట కూడా రిలీజ్ కానుంది.