పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)అప్ కమింగ్ మూవీస్ లో ఒకటైన ‘ఓజి'(og)కి అభిమానుల్లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే.పవన్ ఎక్కడ కనపడినా కూడా ఓజి అని అరవడం కామన్ అయిపోయింది.అది ఎంతలా అంటే ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,మంత్రి హోదాలో పవన్ పలు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నా కూడా అరిచేంతలా. రీసెంట్ గా పవన్ కడపలోని రిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి వైసిపీ మూకల దాడిలో గాయపడిన గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుని పరామర్శించాడు.అభిమానులు ఎప్పటి లాగానే ‘ఓజి’ అని అరవడం స్టార్ట్ చేసారు. దీంతో పవన్ తన అభిమానులని ఉద్దేశించి ఏంటయ్యా మీరు,ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో తెలియదు, పక్కకి జరగండంటూ తన అసహనాన్ని వ్యక్తం చేసాడు
ఇప్పుడు ఈ విషయంపై ఓజి నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తు ‘ఓజి’ పై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం.కానీ పవన్ రాజకీయ సభలకి వెళ్ళినప్పుడు సమయం,సందర్భం చూడకుండా ‘ఓజి’ అని అరుస్తూ ఆయన్ని ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు.ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు కోసం ఆయన నిరంతరం కష్టపడుతున్నాడు.ఆ స్థానాన్ని,స్థాయిని గౌరవించడం మన బాధ్యత.మా చిత్రాన్ని మీ ముందుకు తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం.2025 లో ‘ఓజి’ పండుగా చాలా గట్టిగా జరుగుతుందని మేము నమ్ముతున్నామని ట్వీట్ చేసింది.
ఇక ఓజి లో పవన్ సరసన ప్రియాంక మోహన్(priyanka mohan)హీరోయిన్ గా చేస్తుండగా ఇమ్రాన్ హష్మీ, శ్రీయ రెడ్డి,అర్జున్ దాస్, వెంకట్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.’ప్రభాస్’ తో సాహూ మూవీని తెరకెక్కించిన సుజిత్(sujith)దర్శకత్వం వహిస్తుండగా థమన్ (taman)సంగీతాన్నిఅందిస్తున్నాడు.