2024 వ సంవత్సరానికి సంబంధించి మలయాళ చిత్ర పరిశ్రమలో రెగ్యులర్ చిత్రాలతో పాటు ఎన్నో వెరైటీ,ప్రేమకథా చిత్రాలు తెరకెక్కడం జరిగింది.వాటిల్లో మంజుమ్మేల్ బాయ్స్(manjummel boys),ప్రేమలు(premalu)ఆడుజీవితం వంటి చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యి విజయాన్ని అందుకోవడం జరిగింది.
ఇక ఈ సంవత్సరం మరికొన్నిరోజుల్లో ముగుస్తుందనగా కేరళ చిత్ర నిర్మాతల అసోసియేషన్ ఈ ఏడాదిలో విడుదలైన తమ సినిమాల గురించి మాట్లాడుతు ఈ ఏడాది మొత్తం 199 చిత్రాలు రిలీజ్ కాగా,వాటికి సుమారు 1000 కోట్లు ఖర్చు అయ్యింది.కానీ 26 సినిమాలు మాత్రమే విజయం సాధించడంతో 300 కోట్లు మాత్రమే రాగా 700 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది.నిర్మాణ విలువ, హీరోల పారితోషకం భారీగా పెరగడం వల్లే తమకి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిందనే కారణాన్ని కూడా చెప్పింది.ఇప్పుడు కేరళ మూవీ అసోసియేషన్ ఇలాంటి ప్రకటన చెయ్యడం ఇండియన్ సినీ పరిశ్రమలో చర్చినీయాంశమయ్యింది.
ప్రేమలు,ఆడు జీవితం,ఏ ఆర్ ఏం, ఆవేశం, భ్రమయుగం,సూష్మ దర్శిని,వంటి చిత్రాలు విజయాన్ని సాధించాయి.వాటిల్లో ప్రేమలు మాత్రమే 250 కోట్ల గ్రాస్ దాకా వసూలు చెయ్యగా మిగతావన్నీ 100 కోట్ల దాకా రాబట్టాయి