గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)నుంచి సుమారు రెండు సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న మూవీ గేమ్ చేంజర్(game changer).శంకర్(shankar)ఈ మూవీకి దర్శకుడు కావడంతో మెగా అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల కాబోతుండగా  ప్రొడ్యూసర్ దిల్ రాజు మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ని మొదలుపెట్టాడు. రీసెంట్ గా యుఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా జరుపుకుంది. 

గేమ్ చేంజర్ రిలీజ్ సందర్భంగా విజయవాడకి చెందిన రామ్ చరణ్ యువశక్తీ అభిమానులు ఇండియాలో ఏ హీరోకి లేని విధంగా  256 అడుగుల భారీ కట్ అవుట్ ని విజయవాడలోనే ఏర్పాటు చేసారు.ఈ రోజు అభిమానులు హెలికాఫ్టర్ చేత ఆ కట్ అవుట్ పై పూల వర్షాన్ని కురిపించే ప్రోగ్రాం ని ఏర్పాటు చెయ్యగా, నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఆయన రాగానే అభిమానులు హెలికాఫ్టర్ నుంచి చరణ్ కట్ అవుట్ పై పూల వర్షాన్ని కురిపించారు.ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

ఇక గేమ్ చేంజర్ లో  కియారా అద్వానీ హీరోయిన్ కాగా అంజలి, శ్రీకాంత్,ఎస్ జె సూర్య, సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. తమన్(taman)సంగీత సారధ్యంలో ఇప్పటికే రిలీజైన నాలుగు పాటలు,టీజర్ ఒక రేంజ్ లో ఉండటంతో అంచనాలు అంబరాన్ని తాకాయని కూడా చెప్పవచ్చు. 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here