ప్రస్తుతం తిరుగుతున్న సాధార‌ణ స‌ర్వీసులు కాకుండా, ఇప్పుడు సంక్రాంతి పండ‌గ సీజ‌న్‌లో ప్రత్యేక స‌ర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నారు. విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, విశాఖ‌ప‌ట్నం, చెన్నై, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, రాజాం, పాల‌కొండ‌, రాజ‌మండ్రి, అమ‌లాపురం, తిరుప‌తి, క‌డ‌ప‌, అనంత‌పురంతో పాటు రాయ‌ల‌సీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల‌కు స్పెష‌ల్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అందులో భాగంగానే 1,350 స‌ర్వీసుల‌ను న‌డిపేందుకు ఆర్టీసీ స‌న్నాహాలు చేస్తోంది. గ‌త సంక్రాంతికి విజ‌య‌వాడ నుంచి 1,310 స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను ఏపీఎస్ఆర్టీసీ న‌డిపింది. దాదాపు 7.31 ల‌క్షల కిలో మీట‌ర్ల మేర ఆ స‌ర్వీసులు రాక‌పోక‌లు నిర్వహించాయి. దీనిద్వారా ఆర్టీసీకి రూ.3.06 కోట్ల ఆదాయం వ‌చ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here