పేర్ని నాని, బినామీలకు చుక్కలు చూపిస్తాం – మంత్రి కొల్లు రవీంద్ర

చట్టం నుంచి మాజీ మంత్రి పేర్ని నాని తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. పేదల బియ్యం తినేసి ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. భార్య పేరుతో గిడ్డంగి ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. పేర్ని నాని… తన భార్య పేరు వాడుకుని సానుభూతి పొందాలనుకోవడం సిగ్గుచేటు అన్నారు. చోరీ చేసి డబ్బు తిరిగిచ్చేస్తే దొర అయిపోరన్నారు. దొంగే దొంగ అన్నట్లు పేర్ని నాని వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. పేర్ని నాని, ఆయన బినామీలకు చుక్కలు చూపిస్తామన్నారు. పేర్ని నాని అక్రమాలపై ఈడీ విచారణ జరిపిస్తామన్నారు. బందర్ పోర్టు సమీపంలోని ప్రజల భూములను లాక్కోవడం వాస్తవం కాదా అని మంత్రి కొల్లు రవీంద్ర నిలదీశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here