Karimnagar : ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వచ్చే పర్యాటకులు పెరిగారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది కోటిన్నరకుపైగా సందర్శకులు వచ్చారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా సందర్శకుల తాకిడితో రెండో స్థానంలో నిలిచింది. జగిత్యాల ఐదో స్థానంలో ఉంది.