అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదురించి వచ్చానని.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డనని.. దేనికీ భయపడబోనని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం, దమ్ములేక తనపై, కేటీఆర్‌పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. తమది భయపడే రక్తం కాదని.. భయపెట్టే రక్తమని వ్యాఖ్యానించారు.