పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం ,ఆమె కుమారుడు శ్రీ తేజ్ అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉండటంతో అల్లుఅర్జున్,సుకుమార్ చిత్ర నిర్మాతలు జరిగిన ఘటనకి చింతిస్తు 3 కోట్ల రూపాయలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిలిం డెవలప్మెంట్  కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ఉన్న దిల్ రాజు(dil raju)కూడా రేవతి భర్తకి సినిమా ఇండస్ట్రీలోనే పర్మినెంట్ ఉద్యోగం కల్పిస్తానని మాట కూడా ఇచ్చాడు.

ఇక రేవతి కేసులో అల్లు అర్జున్(allu arjun)పై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకి తరలించగా హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన మరుసటి రోజే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు.ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.దీంతో బెయిల్ పిటిషన్‌పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది.గత విచారణ టైంలోనే పోలీసులు కౌంటర్‌కి సమయం కోరారు.

రిమాండ్ గడువు ముగియడంతో ఇటీవల నాంపల్లి కోర్టు విచారణకు అల్లు అర్జున్ వర్చువల్‌గా హాజరవ్వగా కోర్టు తదుపరి విచారణని జనవరి 10 కి వాయిదా  వేసింది.దీంతో రెగ్యులర్ బెయిల్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే  విచారణ జరగనుంది.

 


 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here