ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(allu arjun)సుకుమార్(sukumar)కాంబోలో డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ గా రిలీజయిన పుష్ప 2(pushpa 2)ఇండియా వైడ్ గా అనేక రికార్డులని తన ఖాతాలో వేసుకుంటున్న విషయం తెలిసిందే.ఇప్పటికే 1500 కోట్ల మైలు రాయిని అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది.హిందీలో అయితే అక్కడి హీరోలకి కూడా సాధ్యం కానీ రీతిలో ఇప్పటివరకు 753 కోట్ల షేర్ ని సాధించి స్టిల్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది.
పుష్ప 2 లో రేపు జనవరి 1 నుంచి కొత్త సీన్స్ యాడ్ అవ్వబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి.మూవీ స్టార్టింగ్ జపాన్ లో ఓపెన్ అవుతుంది.అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ తో పాటు
జపాన్ నటులతో ఒక భారీ ఫైట్ ని అక్కడ చిత్రీకరించారు.తనకి రావాల్సిన డబ్బు కోసం అల్లు అర్జున్ అక్కడకి వచ్చినట్టుగా చూపించగా,ఆ తర్వాత మాత్రం జపాన్ గురించి ఎక్కడ ప్రస్తావించలేదు.కానీ ఇప్పడు యాడ్ చెయ్యబోయే చేసే సీన్స్ లో జపాన్ కి సంబంధించినవే అని తెలుస్తుంది.వాటికి సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నాయని, అల్లుఅర్జున్ కూడా డబ్బింగ్ పనుల్లో ఉన్నాడని అంటున్నారు.
ఇప్పటికే ఎన్నో రికార్డులని క్రియేట్ చేసిన పుష్ప ప్రభాస్(prabhas),రాజమౌళి(rajamoulli)ల బాహుబలి 2 1800 కోట్ల రికార్డుని అందుకోవడానికి కొద్దిగా దూరంలోనే ఉంది.అదనపు సీన్స్ తో అయిన సరే ఆ రికార్డుని దాటాలనే ఈ సీన్స్ ని కలుపుతున్నటుగా వార్తలు వస్తున్నాయి.