ప్రపంచంలోనే అందమైన అనుబంధం అక్కా తమ్ముడు, అన్నా చెల్లెళ్లదే. ఒకరికి కష్టమొస్తే మరొకరు తల్లడిల్లిపోతారు. ఎంత తిట్టుకున్నా, కొట్టుకున్నా కూడా వారు చివరికి ఒక్కటే అవుతారు. బయటకు కోపంగా తిట్టినట్లు నటించినా మనసులో మాత్రం కొండంత ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమను వారు ఎప్పుడూ వ్యక్తపరచరు. కానీ బాధ్యతగా ఉంటారు. అక్కాతమ్ముళ్లు, అన్నా చెల్లెళ్లు ఒకరి కష్టాల్లో మరొకరు తోడుగా ఉంటారు. న్యూ ఇయర్ వచ్చేస్తోంది. ఈ సందర్భంగా మీ ఆత్మీయ అన్నలకు, తమ్ముళ్లకు ప్రేమపూర్వకంగా కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఉంది.