ఈ సంక్రాంతికి ముగ్గురు బడా హీరోల సినిమాలు ఒక దాని వెంట ఒకటి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయనున్నాయి.జనవరి 10 న రామ్ చరణ్(ram charan)నుంచి గేమ్ చేంజర్(game changer)వస్తుండగా,జనవరి 12 న బాలకృష్ణ(balakrishna)డాకు మహారాజ్(daku maharaj)14 న వెంకటేష్(venkatesth)సంక్రాంతికి వస్తున్నాం(sankrathiki vasthunnam)విడుదల కానున్నాయి.ఇక రిలీజ్ డేట్ దగ్గరపడేకొద్దీ ఈ మూడు చిత్రాలు ప్రమోషన్స్ లో వేగాన్నిపెంచాయి.కానీ ఈ విషయంలో వెంకీ కాస్త స్పీడ్ గా ఉన్నాడని అనిపిస్తుంది.
వెంకీ తన సినిమా రిలీజ్ టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు,కొన్ని ఇంటర్వ్యూ లోను పాల్గొంటు అభిమానులకి,ప్రేక్షకులకి సినిమా మీద ఆసక్తిని కలిగేలా చేస్తాడు.కానీ ఇప్పుడు పబ్లిసిటీ విషయంలో వెంకీ తన రూటు మార్చినట్టుగా అనిపిస్తుంది.యంగ్ హీరోలకి ధీటుగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.ప్రెస్ మీట్ లు,ఈవెంట్లకు హాజరవుతు.ప్రమోషనల్ వీడియోల్లోను భాగమవుతున్నాడు.నెల రోజుల నుంచి నాన్ స్టాప్‌గా కంటెంట్ ఇస్తూ, రకరకాల రీతిలో ప్రమోషన్లు చేస్తూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ పేరుని ప్రేక్షకులు మర్చిపోకుండా చేస్తున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి(anil ravipudi)హీరోయిన్లు ఐశ్వర్యా రాజేష్,(iswarya rajesh)మీనాక్షి చౌదరి(meenakshi chowdhary)తో కలిసి రకరకాల ఈవెంట్స్, ఛానెల్స్ లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నాడు.రీసెంట్ గా బాలయ్య అన్ స్టాపబుల్ షో కి కూడా వచ్చి సినిమాకి సంబంధించిన ఎన్నో విషయాలని ప్రేక్షకులతో పంచుకున్నాడు.వెంకీ ఇంతగా ఏ సినిమాను ప్రమోట్ చేయలేదంటే కూడా అతిశయోక్తి కాదు.
ఇక వెంకీ స్వయంగా పాడిన ‘పొంగల్ బ్లాక్ బస్టర్’ సాంగ్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతుంది.ఆల్రెడీ ‘గోదారి గట్టు మీద రామ చిలకవే’ పాట బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. అనిల్ రావిపూడి కూడా డిఫరెంట్ స్టైల్లో ప్రమోషన్లను ప్లాన్ చేస్తు అభిమానులు,ప్రేక్షకులు సంక్రాంతికి వస్తున్నాం కోసం ఎదురుచూసేలా చేస్తున్నాడు.సంక్రాంతికి సూటయ్యే పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెంకీ మూవీ అనే పాజిటివ్ బజ్ కూడా ప్రేక్షకుల్లో ఉంది.దిల్ రాజు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.