ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సినిమాల్లో కొన్ని కామెడీ సీన్స్‌, సెటైరికల్‌ సీన్స్‌ పెడుతుంటారు. ఆడియన్స్‌ కూడా వాటిని ఎంజాయ్‌ చేస్తారు. కానీ, కొన్ని సందర్భాల్లో అవి బెడిసికొడుతుంటాయి. ఇప్పుడు ‘డ్రిgకర్‌ సాయి’ చిత్రం విషయంలో కూడా అదే జరిగింది. ధర్మ, ఐశ్వరశర్మ జంటగా కిరణ్‌ తిరుమలశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబర్‌ 27న విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్‌ వస్తోందని భావించిన చిత్ర యూనిట్‌ సినిమాకి మరింత క్రేజ్‌ తెచ్చేందుకు ఆడియన్స్‌ నుంచి రివ్యూస్‌ తీసుకొని వారిలో 100 మందిని సెలెక్ట్‌ చేసి డిసెంబర్‌ 31న పార్టీ ఇస్తామని ఆఫర్‌ ఇచ్చారు. అందులో భాగంగానే ఒక టూర్‌ ఏర్పాటు చేసుకున్నారు. అంతా సక్సెస్‌ఫుల్‌గా జరుగుతోంది అనుకుంటున్న తరుణంలో ఓ ఘటన చిత్ర యూనిట్‌ని షాక్‌కి గురి చేసింది. 

గుంటూరులోని శివ థియేటర్‌కు వెళ్లి ఆడియన్స్‌తో ఇంటరాక్ట్‌ అయింది యూనిట్‌. సినిమాకి వస్తున్న రెస్పాన్స్‌ గురించి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో డైరెక్టర్‌ కిరణ్‌పై దాడి జరిగింది. షాక్‌కి గురైన టీమ్‌కి ఎవరు దాడి చేసారనేది అర్థం కాలేదు. అయితే మంతెన సత్యనారాయణ అభిమానులు ఆ దాడికి పాల్పడ్డట్టు తెలిసింది. సినిమాలో ఆయన్ని కించపరిచేలా సీన్స్‌ని క్రియేట్‌ చేశారని, వాటిని వెంటనే తొలగించాలంటూ నినాదాలు చేశారు. దానిపై స్పందిస్తూ దాన్ని సినిమాలాగే చూడాలని యూనిట్‌ చెబుతోంది. ఇలాంటి సమస్యలు వస్తాయనే సినిమా ప్రారంభంలో డిస్‌క్లయిమర్‌ కార్డ్‌ వేస్తామని డైరెక్టర్‌ తెలిపారు. సినిమాలో మంతెనగారిని ఎక్కడా కించపరచలేదని, ఆయన అభిమానులు ఎందుకు అలా రియాక్ట్‌ అయ్యారో అర్థం కావడం లేదని అన్నారు కిరణ్‌ తిరుమలశెట్టి. 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here