Allu Arjun Bail: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. అల్లు అర్జున తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టును ఆశ్రయించగా నేడు విచారణ జరిగింది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై జనవరి 3వ తేదీన కోర్టు తీర్పు వెలువరించనుంది. మరోవైపు డిసెంబర్4న జరిగిన ఘటనలో తమ వైఫల్యం ఏమి లేదని సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు లీగల్ టీమ్ ద్వారా వివరణ పంపింది. ప్రీమియర్ షోల నిర్వహణ కోసం థియేటర్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌కు అప్పగించామని అందులో పేర్కొన్నారు. ఘటన జరిగిన రోజు భద్రత కోసం 60మంది ప్రైవేట్ సిబ్బందిని నియమించుకున్నట్టు వివరించారు. అల్లు అర్జున రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.