ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన అనిల్ కుమార్, రజనిశ్రీ, బంకించంద్రశ్రీ, మమిత నాయక్, సంజీవని దేహురి, జాను నాయక్ అనే ఆరుగురు వెయ్యి గంజాయి సుమారు ఐదు కిలోలు బరువైన వాటిని నగరానికి తీసుకొస్తున్నారు. వీరిపై విశ్వసనీయ సమాచారం అందడంతో కోదాడలో ఎక్సైజ్ అధికారులు ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన నల్లబండగూడెం వద్ద 50 మంది ప్రయాణికులతో ఉన్న బస్సును కోదాడ ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు.