థియేటర్లలో సక్సెస్.. ఓటీటీ తర్వాత భారీ పాపులారిటీ

లాపతా లేడీస్ చిత్రం గతేడాదిలోని టోరెంటో ఫిల్మ్ ఫెస్టివల్‍లో ప్రదర్శితమైంది. ఆ తర్వాత ఈ ఏదాది 2024 మార్చి 1వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రం థియేటర్లలోనూ మంచి సక్సెస్ సాధించింది. ప్రశంసలతో పాటు కమర్షియల్‍గానూ సక్సెస్ అయింది. అయితే, ‘నెట్‍ఫ్లిక్స్’ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చిన తర్వాత మూవీకి చాలా పాపులర్ అయింది. ప్రేక్షకులు, సెలెబ్రిటీలు చాలా మంది ఈ చిత్రాన్ని ప్రశంసించారు. అమితాబ్ బచ్చన్, కరీనా కపూర్, ఆలియా భట్, జోయా అక్తర్ ఇలా చాలా మంది ఈ మూవీపై పొగడ్తలు కురిపించారు. సోషల్ మీడియాలో ఈ మూవీపై బజ్ విపరీతంగా నడిచింది. మనసులను ఈ చిత్రం హత్తుకుందని, బెస్ట్ చిత్రం అంటూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here