హైదరాబాద్ లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేద్దామని తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రత్యేక శాసన సభ సమావేశాల్లో ప్రతిపాదన చేశారు. విగ్రహ ఏర్పాటు కోసం సభ ద్వారా ఆమోదం తెలపాలని సభ్యులను కోరారు. ఈ సందర్భంగా బీజేపీ సభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ విగ్రహంతో పాటు పీవీ నరసింహారావు విగ్రహాన్ని కూడా కట్టాలని అన్నారు. దీంతోపాటు మన్మోహన్ సింగ్ స్మారక దినాలు వదిలేసి రాహుల్ గాంధీ న్యూ ఇయర్ వేడుకలకు వియత్నాం వెళ్లారని విమర్శించారు. ఈ క్రమంలోనే మాట్లాడిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.. ఏలేటి మహేశ్వర్ రెడ్డికి చురకలు అంటించారు.