ఓబీసీల సమస్యలపై..
‘ఓబీసీల సమస్యల పైన కేసీఆర్, ఆర్.కృష్ణయ్య, వకుళాభరణం ప్రతినిధి బృందానికి 45 నిమిషాల సమయం ఇచ్చి.. దాదాపు గంటన్నర పాటు అన్ని అంశాలను తెలుసుకున్నారు. సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియాగా మన్మోహన్ సింగ్ పేరుగాంచారు. తాను మౌనంగా ఉండి, ఎన్ని నిందలు వేసినా.. సంస్కరణలను అద్భుతంగా ముందుకు తీసుకుపోయిన వ్యక్తి మన్మోహన్ సింగ్. మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు.. పార్టీ ప్రతినిధి బృందం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరై నివాళులు అర్పించాం’ అని కేటీఆర్ చెప్పారు.