తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు అనుమతించాలని గత కొన్నిరోజులుగా డిమాండ్ వినిపిస్తుంది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… గతంలో తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో ఎలాంటి తేడా లేకుండా జరిగేవన్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణ భక్తులు, రాజకీయ నాయకులపై వివక్ష చూపుతున్నారన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గతంలో కల్పించిన సౌకర్యాలను పునరుద్ధరించాలని కోరారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు గద్వాల ప్రాంతం నుంచి పట్టుచీరను సమర్పించడం ఆనవాయితీగా ఉందన్న విషయం టీటీడీ అధికారులు గుర్తించాలన్నారు. తెలంగాణ వాసులకు ఆంధ్రాతో సంబంధం ఉన్న ఏకైక ప్రాంతం తిరుపతి అని, గతంలో మాదిరిగా తిరుమలలో తెలంగాణ నాయకుల సిఫార్సు లేఖలను స్వీకరించాలని డిమాండ్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here