డిసెంబర్‌ 31న పల్నాడు జిల్లా, నరసరావుపేట నియోజకవర్గం, యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి పల్నాడు జిల్లాకు బయలుదేరుతారు. 10.50 గంటలకు నరసరావుపేట మండలం, యల్లమంద గ్రామానికి చేరుకుంటారు. 11.00 – 11.30 వరకు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారు. 11.35-12.35 వరకు లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 12.40-01.00 వరకు పల్నాడు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమవుతారు 01.45 గంటలకు కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. 02.55 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here