ఈ సంక్రాంతికి యువరత్నబాలకృష్ణ(balakrishna)విక్టరీ వెంకటేష్(venkatesh)గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)లు’డాకు మహారాజ్,గేమ్ ఛేంజర్,సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.దీంతో ఈ సంక్రాంతి మూవీ లవర్స్ కి ఒక మెమొరీబుల్ గా మిగిలిపోనుంది.పైగా ఈ మూడు చిత్రాలు కూడా దేనికదే విభిన్నజోనర్ లో తెరకెక్కి,అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా మంచి బజ్ ని క్రియేట్ చేసుకున్నాయి.


ఇప్పుడు ఈ మూడు సినిమాలకి సంబంధించిన టికెట్ రేట్ల పెంపుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.గేమ్ ఛేంజర్ కి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 135 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 175 రూపాయిల మేర టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి లభించింది. బెనిఫిట్ షో టికెట్ 600 కి పెంచుకునే విధంగా వెసులుబాటు కలిపించారు.

‘డాకు మహారాజ్’కి సింగిల్ స్క్రీన్స్‌లో 110,మల్టీప్లెక్స్‌లలో 135 రూపాయిలు పెంచుకోవచ్చని, బెనిఫిట్ షో కి 500 కి పెంచుకునేలా అనుమతి ఇవ్వడం జరిగింది. మరో మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’కి సింగిల్ స్క్రీన్స్‌లో 75, మల్టీప్లెక్స్‌లలో 100 రూపాయిల చొప్పున పెంచారు. తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండబోదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here