మెుత్తం అప్పు లెక్కించే ముందు క్రెడిట్ కార్డ్‌లు, వ్యక్తిగత రుణాలు, బిల్లులు మొదలైనవాటిని చూడండి. మిగిలిన బ్యాలెన్స్, వడ్డీ రేట్లు, ప్రతిదానికి కనీస నెలవారీ చెల్లింపులతో సహా మీ మొత్తం రుణాన్ని లెక్కించండి. సంపాదించిన మొత్తం ఆదాయం, నెలవారీ ఖర్చులతో పోల్చుకోండి. ఖర్చుల్లో ఎక్కడ సేవ్ చేయవచ్చో, ఎక్కడ తగ్గించవచ్చో గుర్తించండి. సినిమా ఖర్చులు, ఫ్యాన్సీ హోటల్ భోజనం, వినోదం.. కొన్ని అవసరమైన విషయాలను కంట్రోల్ చేయండి. పెట్రోల్ నుంచి పాన్ షాపు వెళ్లే విషయంపై కూడా శ్రద్ధ వహించాలి. పొదుపు ఎందులో చేయాలో క్లారిటీ తెచ్చుకోండి.