మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం మంగళవారం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జీవో ఎంఎస్ నెంబర్ 40ను జారీ చేశారు. దారిద్రరేఖకు దిగువున ఉన్న, పేదరికంలో ఉన్న విద్యార్థులకు ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. మధ్యహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహరం అందించడంతో పాటు ఆరోగ్యం, అన్ని విధాల అభివృద్ధి సాధ్యం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందడంతో పాటు హాజరు శాతం పెరిగే అవకాశం ఉంందని ప్రభుత్వం భావిస్తోంది.
Home Andhra Pradesh ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, రేపటి నుంచి జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు-ap...