రాష్ట్ర వ్యాప్తంగా కనీసం రెండువేలు కొత్త బస్సులు, అద్దె బస్సులు ఉంటేనేఉచిత ప్రయాణం హామీ అమలు చేయగలమని వివరించారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 69 శాతం ఉందని, ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే బస్సుల్లో రద్దీ 94 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. దీంతో పాటు ప్రతి నెలా ఆర్టీసీపై రూ.265 కోట్ల భారం పడనుంది. దీంతో కర్ణాటక, తెలంగాణ, తమిళనాడుతో పాటు పంజాబ్, ఢిల్లీలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణం విధానాలను మహిళ మంత్రులు అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. ఈ మేరకు మంత్రులు అనిత, సంధ్యారాణి త్వరలో పొరుగు రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకం అమలు తీరును పరిశీలిస్తారు.
Home Andhra Pradesh ఏపీలో ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలకు ప్రభుత్వం ఏర్పాట్లు-government makes arrangements for...