అన్స్టాపబుల్ షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి బాబీ, థమన్ వచ్చారు. ఇక బాలయ్య తన స్టయిల్ ని ఇక్కడ ఓపెన్ చేసేసాడు. వాతావరణం బాగుంది ఒక సిట్టింగ్ వేద్దాం అంటూ ఒక మందు బోటిల్ తీసి మామ ఎక్ పెగ్గులా అంటూ చిన్న చిన్న షాట్స్ వేసి మరీ అందించాడు. కొంచెం కొంచెం తాగు అంటూ సలహా కూడా ఇచ్చారు.  ఇక బాబీ బాలయ్యను ఒక ప్రశ్న అడిగాడు. “ఫామిలీతో రిలాక్స్ అవడం ఇష్టమా, మాన్షన్ హౌస్ తో రిలాక్స్ అవడం ఇష్టమా అనేసరికి…”పగలు ఒకళ్ళను ప్రేమిస్తాను , రాత్రి ఒకళ్ళను ప్రేమిస్తాను ” అన్నారు బాలయ్య. తర్వాత బాబీ సెల్ నుంచి ప్రగ్య జైస్వాల్ కి ఫోన్ చేసి “థమన్ ఇక్కడే ఉన్నాడు” అని బాలయ్య చెప్పారు. దానికి ఆమె “ఓ అంటూ సాగదీసి ఐ మిస్ యు సో మచ్ అన్నది. దానికి మిగతా వాళ్లంతా థమన్ ని ఆడుకున్నారు. ఆ ఓ అంటూ ఎందుకు సాగదీసిందో చెప్పాలి అన్నారు.

అంటే 2021 నుంచి 2024 వరకు ఓ అని సాగదీసింది అని అర్ధం అంటూ థమన్ చెప్పుకొచ్చాడు. సినిమాకు పని చేశారా..ఆ అమ్మాయితో పని చేశారా ? అని థమన్ ని అడిగేసారు. ఇక బాలయ్య షో ప్రోమోలో “ఏది పుష్ప అనుకున్నా” అంటూ అల్లు అర్జున్ మ్యానరిజాన్ని యాక్ట్ చేసి చూపించారు. ఇక చివరికి అందరితో కలిసి డాన్స్ చేశారు బాలయ్య. ఇక ఈ ఎపిసోడ్ జనవరి 3 న ఆహా ప్లాటుఫారం మీద టెలికాస్ట్ కాబోతోంది. థమన్ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చేటప్పుడు పవర్ ఆఫ్ అవడం ఆన్ అవడం జరిగేసరికి బాలయ్య ఓహ్ థమన్ నువ్వా ఈ ఎఫెక్ట్ కి కారణం అనేసరికి థమన్ నవ్వేసాడు. ఆ మాటకు థమన్ కౌంటర్ వేసాడు. “ఫస్ట్ టైం థియేటర్ లో స్పీకర్లు కాలిపోయాయి అది మీ సినిమా వల్లనే సర్” అన్నాడు. దానికి బాలయ్య ” నీ స్పీకర్ల కెపాసిటీ పెంచుకో..డాకు మహారాజ్ వస్తోంది” అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు బాలయ్య.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here