ప్రముఖ హీరోయిన్ ‘కీర్తి సురేష్'(keerthy suresh)కి ఈ ఏడాది మెమొరీబుల్ ఇయర్ గా నిలిచిపోతుందని చెప్పవచ్చు.డిసెంబర్ 12 న తన చిన్ననాటి స్నేహితుడు ఆంథోనీ ని వివాహం చేసుకున్న కీర్తి, ఊహించని విధంగా హిందీ సినిమాలో నటించడం. ఈ విధంగా 2024 కీర్తికి మెమొరీబుల్ ఇయర్ గా నిలిచినట్టే.
రీసెంట్ గా కీర్తి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ‘బేబీ జాన్'(baby john)లో నటించే అవకాశం రావడానికి కారణం సమంత(samantha).’తేరి'(teri)ని హిందీలో రీమేక్ చెయ్యాలని మేకర్స్ అనుకున్నప్పుడు సమంత నా పేరుని వాళ్ళకి సూచించింది.కానీ ఆ క్యారక్టర్ చేయడానికి భయపడ్డాను.ఎందుకంటే ‘తేరి’ లో సమంత నే నటించింది. దాంతో నేను ఆమెలా మెప్పించగలనా లేదా అని భయపడ్డాను.కానీ సమంత ఇచ్చిన సపోర్ట్ ని ఇవ్వడం,నువ్వు తప్ప ఎవరు ఈ క్యారక్టర్ చెయ్యలేరని చెప్పడంతో సినిమాని పూర్తి చేశాను.ఆమె స్ఫూర్తి తోనే ఇండస్ట్రీ లో కొనసాగుతున్నానని చెప్పుకొచ్చింది.
ఇక క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లోకి అడుగుపెట్టిన ‘బేబీ జాన్’కి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తుంది.వరుణ్ ధావన్(varun dawan)హీరో కాగా కలిస్(kaleees)దర్శకత్వం వహించాడు. జ్యోతి దేశ్ పాండే, మురాద్ కేతాని లు 180 కోట్లతో నిర్మించగా ఇప్పటికి 43 కోట్లు మాత్రమే వచ్చాయి.