Bandi Sanjay: తెలంగాణలో కమీషన్లపై కాంగ్రెస్‌లోనే అంతర్యుద్ధం నడుస్తోందని, ఎప్పుడైనా ఈ కమీషన్ల భాగోతం బద్దలు కావొచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో తాజా మాజీ సర్పంచుల జేఏసి అధ్యక్షులు అక్కినపల్లి కరుణాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల నాయకులు జోగు లక్ష్మీరాజం, కనివేని శ్రీనివాస్, తాడెపు ఎల్లం, ఏలేటి నర్సింహారెడ్డి తదితరులు బండి సంజయ్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు.