ఐరన్ మ్యాన్ 70.3 ఎండ్యూరెన్స్ రేసు
2024లో ఐరన్ మ్యాన్ 70.3 ఎండ్యూరెన్స్ రేసును తేజస్వి సూర్య పూర్తి చేశారు. ఈ కఠిన రేసును విజయవంతంగా పూర్తి చేసిన తొలి సిట్టింగ్ ఎంపీగా ఆయన రికార్డు సృష్టించారు. వచ్చే ఏడాది మరింత దూరాన్ని అధిగమించేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. “ఈ ఏడాది ప్రారంభంలో నేను గోవాలో ఐరన్ మ్యాన్ 70.3 పూర్తి చేశాను. మన మనస్సు, శరీరం ఎంత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయో ఆ సమయంలో నాకు అర్థమైంది. ఈ సామర్ధ్యం శారీరకం కంటే మానసికం ఎక్కువ. 2025 రేసుకు సన్నద్ధమయ్యే సుసంపన్నమైన అనుభవం కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా పనిలో కూడా నాకు ఉపయోగపడే కొత్త అభ్యాసాలను స్వీకరిస్తాను” అని సూర్య ఐరన్ మ్యాన్ 70.3 గోవా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.