“హైదరాబాద్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చిదిద్దాలన్నది సీఎం సంకల్పం. సీఎం సంకల్పానికి పరిశ్రమ ప్రతినిధులుగా మేమంతా స్వాగతించాం. అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగొద్దు. పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దు. రాజకీయ దాడి, ప్రతిదాడులకు పరిశ్రమను వాడుకోవద్దు. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న చిత్ర పరిశ్రమకు ప్రభుత్వాల సహకారం అవసరం. ప్రజలందరి ప్రోత్సాహం పరిశ్రమకు ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాం”- దిల్ రాజు, ఎఫ్డీసీ ఛైర్మన్