కలెక్టర్, ఎస్పీకి భూమి పత్రాలు అప్పగింత…
అక్రమంగా ప్రభుత్వం నుంచి భూమి పొందిన మాజీ సర్పంచి పద్మ, ప్రభుత్వం ఇచ్చిన భూమి తనకు వద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు లేఖ రాశారు. వెంటనే స్పందించిన కలెక్టర్, ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో మీడియా సాక్షిగా మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ నుంచి భూమికి సంబంధించిన పాస్ బుక్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.