TGB Guidelines : ‘ఒక రాష్ట్రం, ఒక గ్రామీణ బ్యాంకు’ నినాదంతో తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(APGVB) శాఖలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేశారు. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దీంతో దేశంలోని అతి పెద్ద గ్రామీణ బ్యాంకుల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఒకటిగా అవతరించింది. ఏపీజీవీబీ శాఖలు, వ్యవస్థల విలీనం కోసం కార్యకలాపాలు, ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు నాలుగు రోజుల పాటు అంటే 28-12-2024 నుంచి 31-12-2024 వరకు నిలిపివేశారు. ఈ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి తిరిగి అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలోని ఏపీజీవీబీ శాఖలకు సంబంధించిన ఖాతాదారులు ఏటీఎం కార్డు మార్చుకోవడానికి 01.01.2025 తరువాత, వారి బ్యాంకు శాఖను సంప్రదించాలని బ్యాంకు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం టీవీబీ వెబ్సైట్ www.tgbhyd.in ను (లేదా) టోల్ ఫ్రీ నంబర్ 1800 202 725 సంప్రదించవచ్చని సూచించారు. ఏపీజీవీబీ ఖాతాలు కలిగిన తెలంగాణ కస్టమర్లకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ మార్గదర్శకాలు జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here