గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan) శంకర్(shankar) కలయికలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు(dil raju) నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్(game changer).సంక్రాంతి కానుకగా ఈ నెల పది న విడుదల కాబోతున్న ఈ మూవీ లో చరణ్ సరసన కియారా అద్వానీ(kiyara adwani) జత కడుతుండగా అంజలి,ఎస్ జె సూర్య,శ్రీకాంత్,సునీల్,నాజర్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.
ఇప్పుడు ఈ మూవీకి సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ రెండు గంటల నలభై ఐదు నిమిషాల నిడివితో సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.అలాగే కొన్ని కరెక్షన్స్ ని కూడా సూచించింది.టైటిల్ కార్డు తెలుగులో కంపల్సరీ గా ఉండటంతో పాటు,ఆల్కహాల్ కి సంబంధించి బ్రాండ్ పేర్లు కనపడకుండా ఉండటం.చట్ట ప్రకారం అనే డైలాగ్ దగ్గర లెక్క ప్రకారం అని ఉండేలా,కేరళ స్టేట్ పేరు కూడా కనపడకుండా, దుర్గ శక్తీ నాగ్ పాల్ బదులు సుచిత్ర పాండే అనే పేరు,పద్మశ్రీ బ్రహ్మానందం పేరు లో పద్మశ్రీ కనపడకుండా కరెక్షన్స్ ని సూచించింది.