అతిలోకసుందరి శ్రీదేవి భర్తగా,అగ్రనిర్మాతగా బోనీకపూర్(boney kapoor)కి భారతీయ సినీప్రేమికుల్లో ప్రత్యేక స్థానం ఉంది.నాలుగున్నర దశాబ్దాల నుంచి సినిమాలు నిర్మించుకుంటూ వస్తుండగా అందులో మెజారిటీ చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి.2021 లో పవన్ కళ్యాణ్ వన్ మాన్ షో వకీల్ సాబ్ కి కూడా బోణీ కపూర్    వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు.

రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.అందులో సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ పై  నమోదయిన కేసు విషయం ప్రస్తావనకి వచ్చింది.అప్పుడు అయన మాట్లాడుతు ఆ ఘటనలో అల్లు అర్జున్ ని  తప్పు పట్టాల్సిన అవసరం లేదు.చిరంజీవి(chiranjeevi)రజనీకాంత్(rajinikanth)అల్లుఅర్జున్(allu arjun)లాంటి హీరోల సినిమాలకు మొదటి రోజు ప్రేక్షకులు చాలామంది వస్తారు.థియేటర్ దగ్గర ఆ రోజు  కొన్ని వేల మంది ఉన్నారు.నేను అంత మందిని చూడడం కూడా అదే మొదటిసారి.అనుకోకుండా జరిగిన ఘటనకు అల్లు అర్జున్ ను మాత్రమే బాధ్యుడిని చేయడం కరక్ట్ కాదని చెప్పుకొచ్చాడు.

 

ఇక తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబానికి పుష్ప(pushpa)టీం 3 కోట్ల రూపాయలు ఇచ్చిన విషయం తెలిసిందే.రేవతి భర్తకి ఎఫ్ డి సి చైర్మన్ హోదాలో దిల్ రాజు సినిమా ఇండస్ట్రీలోనే పర్మినెంట్ ఉద్యోగం కూడా ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే.రేవతి కుమారుడు శ్రీ తేజ్ ప్రస్తుతం హాస్పిటల్ లో కోలుకుంటున్నాడు.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here