గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)శంకర్(shankar)కలయికలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు(dil raju)నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్(game changer).సంక్రాంతి కానుకగా ఈ నెల పదిన విడుదల కాబోతున్న ఈ మూవీలో చరణ్ సరసన కియారా అద్వానీ జత కడుతుండగా అంజలి,ఎస్ జె సూర్య,శ్రీకాంత్,సునీల్,నాజర్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.

రీసెంట్ గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది.దీంతో సినిమాకి సంబంధించి ఎప్పట్నుంచో దొరకని కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి.చరణ్ డ్యూయల్ రోల్ అనే విషయం అర్ధమయ్యింది.కాకపోతే చరణ్ అన్న దమ్ములాగా చేస్తున్నాడా లేక తండ్రి కొడుకులుగా చేస్తున్నాడా అనే ఒక్క విషయంలో మాత్రం సస్పెన్సు నెలకొని ఉంది. అంజలీ పెద్ద చరణ్ కి భార్య అని తెలిసిపోయింది.దీంతో నేను కూడా గేమ్ చేంజర్ లో వన్ ఆఫ్ ది హీరోయిన్ అని ఎప్పట్నుంచో ఆమె  చెప్తున్నటు  మాట నిజమయ్యింది.ట్రైలర్ లో  మా పార్టీ సేవ చెయ్యడానికే కానీ సంపాదించటానికి కాదనే వర్డ్ ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఎందుకంటే  దిల్ రాజు కొన్ని రోజుల క్రితం గేమ్ చేంజర్ లో  పవన్ కళ్యాణ్(pawan kalyan)కి సంబంధించిన డైలాగులు ఉంటాయని చెప్పిన నేపథ్యంలో ఆ డైలాగ్ ఆసక్తిగా మారింది

ఇక ట్రైలర్ అయితే ఒక రేంజ్ లో ఉంది.ఐఏఎస్ ఆఫీసర్ కి, ముఖ్యమంత్రికి మధ్య జరిగే పోరాటమే ఈ గేమ్ చేంజర్. 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here