లడ్డూలా దొరికిందా..
‘జగన్‌పై చర్య తీసుకునేందుకు సెకీ వ్యవహారం లడ్డూలా దొరికింది అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. నిజంగా అలా అవకాశం దొరికితే వదిలిపెట్టే వ్యక్తి చంద్రబాబేనా? దీనిలో ఏమీ లేదని తెలిసి, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఆదానీపై ఏం చర్య తీసుకోలేను అంటున్నారు. అమెరికాలో తేలితే కానీ ఏం చేయలేను అంటున్నారు. అంటే అసలు ఈ వ్యవహారంలోనే ఏం లేదు అని అర్థమవుతోంది. జగన్‌పై యాక్షన్ తీసుకోవాలని అనుకుంటే, సెకీ మీకు లడ్డూలా దొరికితే ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు. ఆదానీ మీద చర్య తీసుకునే ప్రశ్నే లేదంటున్నారు. ఆదానీ ఒప్పందంలో లంచాల ఆరోపణలు ఉన్నాయి కదా.. వాటిని రద్దు చేస్తారా’ అని రాంబాబు ప్రశ్నించారు.