భారత ఆటోమెుబైల్ రంగంలో మారుతి సుజుకిది ప్రత్యేకమైన స్థానం. ఈ కంపెనీ కార్లకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. కస్టమర్ల ఇష్టాలకు తగ్గట్టుగా కొత్త కార్లను మార్కెట్‌లోకి తీసుకువస్తుంది మారుతి. ఇప్పుడు ఈ కంపెనీ నుంచి మరో రెండు కార్లు రానున్నాయి. ఇ-విటారా, 7 సీట్ల మోడల్, దీనికి ‘వై 17’ అనే కోడ్ నేమ్ ఉంటుంది. మారుతి వై 17 ప్రీమియం ఎస్‌యూవీ. ఇది హ్యుందాయ్ అల్కాజార్, మహీంద్రా ఎక్స్‌యూవీ 700, టాటా సఫారీ వంటి మోడళ్లతో పోటీపడుతుంది. దీంతో ఈ కార్ల అమ్మకాలపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది.