గత సంవత్సరం బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్ సేవిస్తు ప్రముఖ సినీ నటి నటి హేమ(hema)అక్కడి పోలీసులకి పట్టుబడిన వార్త తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.నేను డ్రగ్స్ తీసుకోలేదని హేమ ఎన్నో వీడియోలలో కూడా చెప్పింది.కానీ ఆమె డ్రగ్స్ సేవించిందని, టెస్ట్ రిపోర్ట్ లో కూడా పాజిటివ్ గా వచ్చిందంటు బెంగుళురు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత విచారణకు వచ్చిన హేమని అరెస్ట్ చెయ్యడం కూడా చేసారు.

దీంతో హేమ బెంగుళురు హైకోర్టులో ఒక పిటిషన్ వెయ్యడం జరిగింది.తనపై నమోదైన డ్రగ్స్ కేస్ కొట్టివేయ్యాలని,తాను డ్రగ్స్ సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సదరు పిటిషన్ లో ఆమె  పేర్కొంది.ఇప్పుడు ఈ కేసులో బెంగళూరు హైకోర్టు స్టే విధించింది.పోలీసులు ఇప్పటికే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసారు.

 


 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here