వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల పైనుంచి దూసుకెళ్లిన కారు ఘటన కాకినాడలో జరిగింది. కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ టైంలో వచ్చిన ఓ కారును ఆపే ప్రయత్నం చేశారు. అయితే ఆ కారులో గంజాయిని తరలిస్తుండటంతో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వీలుగా వారిపైనే పోనిచ్చారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here